సూట్ కేసులో మృతదేహం | Deadbody in suit case | Sakshi
Sakshi News home page

సూట్ కేసులో మృతదేహం

Jan 9 2015 4:18 AM | Updated on Sep 2 2017 7:24 PM

సూట్ కేసులో మృతదేహం

సూట్ కేసులో మృతదేహం

నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది.

నిజామాబాద్ క్రైం: నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పారవేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రాంతం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్‌కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో కాలనీవాసులు కొందరు అనుమానం వచ్చి సూట్‌కేసులో ఏం ఉందోనని తెరిచిచూశారు.

సూట్‌కేసులో 35 నుంచి 40 ఏళ్లవయసున్న వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, తెల్లగీతాల షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం ఏ మాత్రం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement