breaking news
nizamsagar Canal cutta
-
నిజాంసాగర్ కెనాల్‌కు గండి.. ఇళ్లలోకి నీరు
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్‌కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు. -
సూట్ కేసులో మృతదేహం
నిజామాబాద్ క్రైం: నగర పరిధిలోని నాగారం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్టపై సూట్‌కేసులో మృతదేహం గురువారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి పారవేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం ప్రాంతం బాబాన్ సాహెబ్ పహడ్ నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఓ సూట్ కేసు పడి ఉంది. ఆ సూట్‌కేసు నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో కాలనీవాసులు కొందరు అనుమానం వచ్చి సూట్‌కేసులో ఏం ఉందోనని తెరిచిచూశారు. సూట్‌కేసులో 35 నుంచి 40 ఏళ్లవయసున్న వ్యక్తి కుళ్లిపోయిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ ఆనంద్‌కుమార్, రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నెల రోజుల క్రితం హత్య జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుడు నలుపు రంగు ఫ్యాంట్, తెల్లగీతాల షర్టు ధరించి ఉన్నాడు. మృతదేహం ఏ మాత్రం గుర్తు పట్టనంతగా కుళ్లిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.