చెన్నైలో దారుణం
ఆగ్రాలో ఎర్రటి సూట్ కేసు గుర్తింపు
సాక్షి, చెన్నై: ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నై సమీపంలోని గూడువాంచేరిలో నరికి చంపి, ఆమె శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఆగ్రాకు పంపించడం కలకలం రేపింది. బాధితురాలిని ఒడిశాకు చెందిన హయత్ నిషాగా పోలీసులు గుర్తించారు. ఆమె విడాకులు తీసుకొని తాంబరంలోని ఓ సంస్థలో పనిచేస్తూ 19 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది.
చెన్నై నుంచి ఆగ్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీలో ఒక ఎర్రటి సూట్‌కేస్ లభ్యమైంది. దానిని తెరిచి చూడగా మహిళ శరీర భాగాలు ముక్కలుగా లభించాయి. ఆగ్రా నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లోని 350కి పైగా సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక యువ జంట ఆ ఎర్రటి సూట్‌కేస్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో పెట్టి సబర్బన్ రైల్లో గూడువాంచేరికి వెళ్లినట్లు గుర్తించారు.


