కొరుక్కుపేట: ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ హ్యామనిటీస్ డీన్ డాక్టర్ దురైస్వామి హితపు పలికారు. ఎస్‌కేపీడీ అండ్ ఛారిటీస్ నిర్వాహణలో కొనసాగుతున్న మహర్షి విద్యా మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్ 12వ వార్షికోత్సవ వేడుకలు చైన్నె తేనంపేటలోని కామరాజర్ అరంగం వేదికగా శనివారం ఘనంగా జరుపుకున్నా రు. పాఠశాల కరస్పాండెట్ టివి రామకుమార్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ దురైస్వామి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ఆరంభించారు. ప్రిన్సిపల్ పి సుబ్రమణ్యం స్వాగతోపన్యాసం చేయగా, ఎస్‌కెపిడి అండ్ చారిటీస్ ట్రస్టీలు ఎస్‌ఎల్ సుదర్శనం, సిఆర్ కిషోర్ బాబు, తాతా బద్రీనాథ్, చిన్నిబాలాజీ, సెక్రటరీ ఎం కిషోర్‌కుమార్‌లు కలసి అతిథులను ఘనంగా సత్క రించారు. అంతకు ముందు వివిధ పోటీల్లో ప్రతిభను చాటుకున్న విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు . చివరిగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


