ప్రభు, విజయ్‌ వర్మ నూతన చిత్రం | - | Sakshi
Sakshi News home page

ప్రభు, విజయ్‌ వర్మ నూతన చిత్రం

Aug 23 2026 1:46 AM | Updated on Aug 23 2026 1:46 AM

తమిళసినిమా: నటుడు ప్రభు, బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 ఫేమ్‌ విజయ్‌ వర్మ కలిసి నటించిన నూతన చిత్రం శనివారం చైన్నెలో పూజా కా ర్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రోమీ యో పిక్చర్స్‌ రాహుల్‌,అవియేట్‌ పిక్చర్స్‌ గోకుల్‌ శ్రీనివాసన్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్‌ చిత్ర దర్శకుడు, డిసి చిత్రం రచయిత ఫ్రాంక్లిన్‌ జెగప్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా ఇందులో ఒక ప్రముఖ నటి నాయకిగా నటించనున్నట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నిర్మాత రోమియో పిక్చర్స్‌ రాహు ల్‌ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ముత్తుకుమార్‌, రమేష్‌ తిలక్‌, దిలీప్‌ సుబ్బరాయన్‌, అరుణ్‌ మాదేశ్వరన్‌,దీనా, కవితా భారతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా చిత్ర పూజా కార్యక్రమాలకు దర్శకుడు పా.రంజిత్‌, అరుణ్‌ మాదేశ్వరన్‌ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులు గా పాల్గొని యూనిట్‌ సభ్యుల కు శుభాకాంక్షలు అందించారు. ఇది డార్క్‌ కామెడీ నేపధ్యంలో తెరకెక్కిస్తున్న వైవిధ్య భరిత సస్పె న్స్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గా లు తెలిపాయి. ఈ చిత్ర దర్శకుడు ఫ్రాంక్లిన్‌ జెగప్‌ తన అసోసియేట్‌ దర్శకుడు అని, ఇది ఇప్పుడు వస్తున్న చిత్రాలలో మరొకటిగా ఉండదని దర్శకుడు పా.రంజిత్‌ పేర్కొన్నారు. చిత్ర కథ, తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుందని చెప్పారు. రైటర్‌ చిత్ర దర్శకుడు ఫ్రాంక్లిన్‌ చాలా మంచి కథా చెప్పారని, ఇలాంటి విభిన్న కథా చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని నటుడు ప్రభు పేర్కొ న్నారు. చిత్ర దర్శకుడు ఫ్రాంక్లిన్‌ జెగప్‌ తెలుపుతూ ఈ ప్రాజెక్ట్‌ గురించి రాహుల్‌ తనతో చర్చించినప్పుడు ఆయనకు తాను ఇచ్చిన ఐడియా బాగా వచ్చిందన్నా రు. నిజానికి ఈ చిత్రాన్ని తామే నిర్మించాలని భావించామన్నారు. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, ప్రదీప్‌ కాళిదాస్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మరోసారి ప్రతినాయకిగా..

తమిళసినిమా: విలన్‌ పాత్ర బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్‌ అవుతుందంటారు. అదే విధంగా నాయకి పాత్ర కంటే ప్రతినాయకి పాత్రలకే నటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రముఖ కథానాయికలు ప్రతినాయికల్లో నటించడానికి సుముఖత చూపరు. అందుకు కారణం ఇమేజ్‌ పోతుందనే. అయితే నటి రెజీనా వంటి అతి కొద్ది మంది హీరోయిన్లు తమ ఇమేజ్‌ కు అడ్డీకట్ట వేసి నచ్చిన పాత్రల్లో విలనిజం ప్రదర్శించడానికి వెనుకాడరు. ఇంతకు ముందు తమిళం, తెలుగు తదితర భాషల్లో కథానాయికిగా నటించి పేరు తెచ్చుకున్న రెజీనా కొన్ని చిత్రాల్లో ప్రతినాయకి గాను నటించి ప్రశంసలు పొందారు. అలా ఆ మధ్య నటుడు అజిత్‌ హీరోగా నటించిన విడాముయర్చి చిత్రంలో నటి రెజీనా విలనిజాన్ని ప్రదర్శించారు. కాగా తాజాగా. నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్న మూకుత్తి అమ్మన్‌ – 2 చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా నటిస్తున్నట్లు తాజా సమాచారం. 2020లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన మూకుత్తి అమ్మన్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌. మొదటి చిత్రానికి నటుడు ఆర్‌ జే.బాలాజీ దర్శకత్వం వహించగా , దాని సీక్వెల్‌కు సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతారతో పాటు ఊర్వశి, స్నేహా, యోగిబాబు, దునియా విజయ్‌, సింగం పులి, అభినయ, ఇనియ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నటి రెజీనా పాత్ర చాలా కొత్తగా, ఉంటుందని, ఆమె గెటప్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం.కాగా తదుపరి మడోనా అశ్విన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా నటించనున్న చిత్రంలోనూ నటి రెజీనా కీలక పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement