తిరుత్తణి: విద్యుత్ తీగలు రాజుకుని ఇంట్లో వస్తువులు అగ్నికి ఆహుతి కాగా, సకాలంలో అగ్ని ప్రమాదం గుర్తించి కుటుంబీకులు వెలుపలకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుత్తణి రైల్వే స్టేష న్ సమీపంలోని ముస్లిం వీధికి చెందిన హారీఫ్(45) ఓ ప్రయివేటు కర్మాగారంలో పనిచేస్తున్నారు. అతని ఇంటి గ్రౌండ్ ప్లోర్లో ఏసీ మెకానిక్ దుకాణం అద్దెకు ఇచ్చా డు. పై అంతస్తులో హారీఫ్ భార్యాపిల్లలతో కాపు రం ఉంటున్నారు. ఈక్రమంలో శనివారం ఉదయం ఇంట్లో విద్యుత్ తీగలు రాజుకుని మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ అధికారి సంపత్ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కానీ అప్పటికే ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు రూ. ఐదు లక్షలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


