క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 23 2026 1:46 AM | Updated on Aug 23 2026 1:46 AM

● ఇతర రాష్ట్రాల విద్యార్థుల ప్రయత్నం

పుదుచ్చేరిలో

వైద్య సీట్లకు డిమాండ్‌

కొరుక్కుపేట: పుదుచ్చేరి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాల కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్లను సెంటాక్‌ కన్సల్టేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య కోర్సులకు 6,023 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ముసాయిదా ర్యాంకుల జాబితాను విడుదల చేశారు. ఈ బ్యాచ్‌లో 1,521 మంది ఉన్నారు. వారి సర్టిఫికెట్లను పరిశీలించగా, తమిళనాడు, కేరళలకు చెందిన 17 మంది విద్యార్థులు నకిలీ పత్రా ల ద్వారా ద్వంద్వ పౌరసత్వం పొంది సెంటాక్‌ కన్సల్టేషనన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా, తమిళనాడుకు చెందిన 9 మంది, కేరళకు చెందిన 8 మంది విద్యార్థులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తెలిసింది. దీని నేపథ్యంలో, ఆ విద్యార్థులకు వివరణ కోరుతూ నోటీసు పంపాలని సెంటాక్‌ పరిపాలన నిర్ణయించింది. దాని కి అనుగుణంగా, ఆ విద్యార్థులు సరైన వివరణ ఇవ్వాలి. వారు నకిలీ సర్టిఫికెట్లతో ద్వంద్వ పౌరసత్వంతో రెండు రాష్ట్రాల్లోనూ దరఖాస్తు చేసుకున్నట్లు తేలితే, ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది , ఆ 17 మందిని నీట్‌ మెరిట్‌ జాబితా నుంచి తొన్‌స్తామని వెల్లడించారు.

టిప్పర్‌కు మంటలు

తిరుత్తణి: జాతీయ రహదారిలో వెళ్తున్న టిప్పర్‌ లారీ ట్రక్కు టౌర్ల నుంచి మంటలు చెలరేగడంతో శనివారం కలకలం చోటుచేసుకుంది. చైన్నె మాధవరం నుంచి ఆర్కేపేట సమీపంలోని టీసీ కండ్రిగకు గ్రావెల్‌ కోసం ఖాళీ టిప్పర్‌ లారీ శనివారం ఉదయం ప్రయాణించింది. ఆ లారీని వంగనూరుకు చెందిన శ్రీధర్‌(36) నడిపాడు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో తిరుత్తణి సమీపం కాశినాథపురం క్రాస్‌ వద్ద వెళ్లుతుండగా అకస్మాత్తుగా టిప్పర్‌ ట్రక్కు టైర్ల నుంచి మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి లారీ ఇంజిన్‌ భాగం విడదీసి దూరంగా తీసుకెళ్లాడు. దీంతో డీజిల్‌ ట్యాంకు వున్న ప్రాంతంకు ఇబ్బంది తప్పింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను కట్టడి చేశారు. తిరుత్తణి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రేసింగ్‌కు.. ఇద్దరు యువకుల బలి

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని చైన్నె తిరుపతి జాతీ య రహదారిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో యువకులు కొందరు బైక్‌ రేసింగ్‌లో పాల్గొనినట్లు తెలుస్తోంది. జాతీయ రహ దారిలో రోడ్డు విస్తరణ పను లు జరుగుతున్నందున రోడ్డుకు మధ్యలో డివైడర్‌ లేకపోవడంతో అతి వేగంగా తిరువళ్లూరు వైపు వెళ్లిన బైకు తిరుత్తణి వైపు వచ్చిన మరో బైకును ఢీకొంది. అదే సమయంలో తిరువళ్లూరు వెళ్తున్న మరో బైకు సహా మూడు బైకులు పరస్పరం ఢీకొ న్నాయి,. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సాయంతో క్షతగాత్రులను తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కనకమ్మసత్రం పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణలో తిరుత్తణికి చెందిన తరుణ్‌(19), చైన్నెకు చెందిన సంజీవి రామన్‌ (30) మృతి చెందినట్లు తెలిసింది. అలాగే తిరుత్తణికి చెందిన నవీన్‌కుమార్‌, ప్రకాష్‌కు గాయాలయ్యాయి. స్పోర్ట్స్‌ బైకులో రేసింగ్‌ చేపట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

కూలేస్థితిలో పోలీస్‌ క్వార్టర్స్‌

– స్థానికుల ఆందోళన

తిరువొత్తియూరు: పొన్నేరి ఎం.జి. నగర్‌ ప్రాంతంలో పాత పోలీసు క్వార్టర్స్‌ ఉంది. ఇక్కడ పాత మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనం కూడా ఉంది. ఈ క్వార్టర్స్‌ చుట్టూ 200కు పైగా ఇళ్లు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఈ పోలీసు క్వార్టర్స్‌ పాత మహిళా పోలీస్‌ స్టేషన్‌ భవనం కూలిపోయే ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. ఈ భవనాల చుట్టూ చెట్లు, తీగలు పెరిగి దట్టమైన పొదల్లా మారాయి. దీనివల్ల పాములు, తేళ్లు వంటి విషపూరిత కీటకాల సంచారం పెరిగింది. ఇక్కడి నివాసాల్లోకి తరచూ పాములు, విషకీటకాలు వస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నా రు. కాబట్టి, కూలిపోయే స్థితిలో ఉన్న ఈ భవనాన్ని తొలగించి, పోలీసు శాఖ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సహకార సంఘాల

కమిటీ సమావేశం

తిరువళ్లూరు: తిరువళ్లూరు మండల సహాకార సంఘం ద్వారా టాప్‌సెట్కో రుణం పథఽకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ప్రత్యేక సమావేశం జాయింట్‌ రిజిస్టర్‌ జయశ్రీ అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రుణం కోసం దరఖాస్తున్న చేసుకున్న వారి వినతుల పరిశీలన, అర్హత, డాక్యుమెంట్‌ల తనిఖీ తదితర వాటిని టాప్‌సెట్కో రుఽణ పథకం కమిటి సభ్యులు చేపట్టారు. అనంతరం వ్యక్తిగత రుణం కోస దరఖాస్తు చేసుకున్న 14 మంది లబ్దిదారులు, 15 డ్వాక్రా సంఘాలలోని సభ్యులతో కలిసి మొత్తం 223 మందికి రూ. 2.10 కోట్ల రుణాలను విడుదల చేయాలని టాప్‌సెట్కో కమిటీ సభ్యులు ప్రభుత్వానికి, సంబంధిత టాప్‌సెట్కో కార్యాలయానికి సిఫార్సు చేశారు. డిప్యూటీ రిజిస్ట్రార్‌ మంగళదాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement