శునకాన్ని ఢీ కొని యువకుడి మృతి | a man died by hitting a dog | Sakshi
Sakshi News home page

శునకాన్ని ఢీ కొని యువకుడి మృతి

Feb 24 2015 8:30 PM | Updated on Sep 29 2018 4:26 PM

బైకుపై వేగంగా వెళ్తూ కుక్క అడ్డురావడంతో దానిని ఢీ కొని కిందపడి వ్యక్తి యువకుడు మృతి చెందాడు.

సంతోష్‌నగర్(హైదరాబాద్ క్రైం): బైకుపై వేగంగా వెళ్తూ కుక్క అడ్డురావడంతో దానిని ఢీ కొని కిందపడి వ్యక్తి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కంఛన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుభాష్‌నగర్‌కాలనీలో మంగళవారం జరిగింది. వివరాలు.. మీర్‌పేటకు చెందిన ఆడమ్స్(22), బాలు, శివలు బైకుపై వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న బైకుకు కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న ఆడమ్స్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన శివ, బాలులను ఒవైసీ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement