
సాక్షి, కృష్ణా జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై లాక్‌డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదయ్యింది. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా కార్యకర్తలతో కలిసి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో రాజేంద్రప్రసాద్‌తో పాటు తొమ్మిది మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ సమయంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లు ఉయ్యూరు పోలీసులు తెలిపారు.