‘శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?’ | Perni Nani Fires On Chandrababu Govt, Says Who Will Protect Democracy If Law Keepers Turn Violent? | Sakshi
Sakshi News home page

‘శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?’

Feb 1 2026 2:39 PM | Updated on Feb 1 2026 4:05 PM

Perni Nani Fires On Chandrababu Govt

సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌కు దేవుడు వాతలు పెట్టాడని.. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపం పండి లడ్డూలో కొవ్వు వాడలేదని వచ్చిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  బరి తెగించి దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ఫ్లెక్సీలు పెట్టారని మండిపడ్డారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 ప్రకారం చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ మీద కేసులు పెట్టాలన్నారు.

‘‘తప్పుడు ఫ్లెక్సీలు పెట్టడం వల్లనే అంబటి వెళ్లి ఆ ఫ్లైక్సీ లు తొలగించాలన్నారు. చంద్రబాబు పెట్టించిన తప్పుడు ఫైక్సీలకు పోలీసులు కాపలా ఉండటం దురదృష్టం. ఏపీలో పోలీస్‌ వ్యవస్థ దిగజారిపోయింది. డీజీపీ సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి బయటకు వస్తుంటే అంబటిపై దాడికి యత్నించారు. టీడీపీ మహిళలు కూడా సభ్యత మరిచి పచ్చిగా వినలేని భాషతో మాట్లాడారు.

..తన మాటలను వెనక్కి తీసుకుంటున్నాని, విచారిస్తున్నానని అంబటి చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబుపై దాడి చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సినవారే దాడులు చేయించడం ధర్మమా?. ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడం, డబ్బులతో రాజకీయం చంద్రబాబు బ్రాండింగ్‌’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement