ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు | Rash Driving Case Registered On Kartekeya Myadam | Sakshi
Sakshi News home page

ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు

Published Fri, Jan 19 2024 3:31 PM | Last Updated on Fri, Jan 19 2024 3:34 PM

Rash Driving Case Registered On Kartekeya Myadam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియాల్టర్ కార్తికేయ మ్యాడం అని హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఇటీవల ‘ఎక్స్‌’ ట్విటర్‌లో  వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.

కారు రిచ్ మౌంట్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం కారు జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ వైపు కార్తీకేయ కారు నడిపినట్లు విచారణలో వెల్లడింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయిలో ఉన్నట్లు సమాచారం. కార్తీకేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. ఒకరి మృతి.. కేసు నమోదు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement