జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు | Jubilee Hills Venkateswara Swamy Brahmotsavalu | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Jan 29 2026 12:12 PM | Updated on Jan 29 2026 12:47 PM

Jubilee Hills Venkateswara Swamy Brahmotsavalu

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఫిబ్రవరి 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం.ల నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

17-02-2026

ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం -  ఉ. 10.30 - 11.00 గంటల వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం

18-02-2026

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

19-02-2026

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

20-02-2026

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

21-02-2026

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)

22-02-2026

ఉదయం – హనుమంత వాహనం

రాత్రి – గజ వాహనం

23-02-2026

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

24-02-2026

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

25-02-2026

ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)

రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)

26.02.2026.

మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

(చదవండి: అడవి బిడ్డలే ఆరాధ్య దైవాలై)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement