కొనసాగుతున్న సిట్‌ విచారణ | BRS Santhosh attend SIT investigation in phone tapping case updates | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న సిట్‌ విచారణ

Jan 27 2026 3:17 PM | Updated on Jan 27 2026 4:59 PM

BRS Santhosh attend SIT investigation in phone tapping case updates

 సిట్‌ విచారణ.. అప్‌డేట్స్‌

  • ఫోన్‌  ట్యాపింగ్‌ కేసులో కొనసాగుతున్న సిట్‌ విచారణ
  • 2 గంటలుగా మాజీ ఎంపీ సంతోష్‌ను ప్రశ్నిస్తోన్న సిట్‌
     
  • జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు మాజీ ఎంపీ సంతోష్‌రావు
  • సిట్‌ విచారణకు హాజరైన సంతోష్‌రావు
  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారించనున్న సిట్‌

సంతోష్‌కు సిట్‌ నోటీసులు

  • సోమవారం(జనవరి 26వ తేదీ) సంతోష్‌రావు సిట్‌ నోటీసులు
  • ఈరోజు(మంగళవారం, జనవరి 27వ తేదీ) జూబ్లీహిల్స్‌ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
     

హరీష్‌, కేటీఆర్‌లను విచారించిన సిట్‌

  • ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా  సంతోష్‌కు నోటీసులు
  • మంగళవారం మధ్యాహ్నం  మూడు గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌ విచారణకు హాజరు కావాలని స్పష్టం 
  • .సీఆర్సీసీ 160 కింద నోటీసులు
     
  • ఈ కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్‌ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచ్చిందనేది సిట్‌ వాదన.  ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్‌ఎస్‌ నేతలు ఇలా చేశారని సిట్‌ చెబుతోంది.
     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement