మామిడి చెట్ల పెళ్లి.. గ్రామంలో సంబరాలు | traditional tree marriage ritual performed for better mango harvest | Sakshi
Sakshi News home page

మామిడి చెట్ల పెళ్లి.. గ్రామంలో సంబరాలు

Mar 14 2026 2:13 PM | Updated on Mar 14 2026 2:13 PM

traditional tree marriage ritual performed for better mango harvest

రాజన్న సిరిసిల్ల జిల్లా: కథలాపూర్‌ మండలం ఇప్పపెల్లి గ్రామంలో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శుక్రవారం పెళ్లి జరిపించారు. గ్రామశివారులో ముదిరాజ్‌ సంఘం తరఫున 5 ఎకరాల మామిడితోట నిర్వహిస్తున్నారు. మామిడిచెట్లకు పెళ్లి జరిపిస్తే కాయలు బాగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడిచెట్లకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. అనంతరం సంఘం సభ్యులు సామూహిక భోజనాలు చేశారు. అర్చకులు పులికాంత ప్రమోద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement