వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం | Tragedy: Three Die After Falling Into Farm Well | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం

Mar 14 2026 5:03 PM | Updated on Mar 14 2026 5:33 PM

Tragedy: Three Die After Falling Into Farm Well

భూపాలపల్లి:  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది.  క్రేన్‌ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది.  క్రేన్‌తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. 

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్‌(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి  మోహన్‌ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement