అప్పు చెల్లించాలని ఇంటికి తాళం

Locked the house for not paying the loan - Sakshi

పోలీసులను ఆశ్రయించిన గిరిజన మహిళ

బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కొత్తూరు : తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని దౌర్జన్యం చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన మండలంలోని సిద్ధాపూర్‌ పంచాయతీ పులిచర్లకుంటతండాలో బుధవారం చోటు చేసుకుంది.

కొత్తూరు ఎస్సై శ్రీశైలం వివరాల ప్రకారం... సిద్ధాపూర్‌కు చెందిన షరీఫ్‌ వద్ద పులిచర్లకుంటతండాకు చెందిన లింగ్యానాయక్‌ రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుండి షరీఫ్‌ వద్ద కూలీ పనులు చేస్తున్నాడు.

ఇటీవల తాను అనారోగ్యానికి గురికావడంతో పనికి వెళ్లడం లేదు. కాగా షరీఫ్‌ తన వద్దకు పనికి రావాలని లేని పక్షంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించాలని లింగ్యా ఇంటి వద్ద గొడవకు దిగాడు.

అంతటితో శాంతించకుండా ఇంట్లో ఉన్న లింగ్యా భార్య లిలీని వారి పిల్లలను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసుకున్నాడు. అప్పు త్వరలో తీర్చుతామని వేడుకున్నా కనికరించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో షరీఫ్, అతడి కుమారుడు సలీంలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. కాగా రూ. 80 వేలు అప్పుగా తీసుకొని రెండేళ్ల పాటు కూలీ పనులు చేసినా అప్పు తీరలేదంటూటు షరీఫ్‌ తన భర్తను భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం చేస్తున్నాడని లింగ్యా భార్య లిలీ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top