ఒకే రోజు 100 కేసులు నమోదు

100 cases registered in the same day - Sakshi

తాండూరు : వారం రోజులుగా పోలీసుశాఖ వాహనదారులపై కొరడా జులిపించింది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ కేసుల (ఆన్‌లైన్‌) నమోదును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని రెండు సర్కిళ్లలో ఉన్న పోలీస్‌స్టేషన్లలో పోలీసు అధికారులు మంగళవారం ఒకే రోజు 100 ఈ కేసులు నమోదు చేశారు.

బుధవారం రోజు తాండూరు మున్సిపల్‌ కోర్టులో ఈ కేసులు నమోదైన వారికి న్యాయమూర్తి ట్రాఫిక్‌ రూల్స్‌ సంబంధించిన చట్టం ప్రకారం వాహనదారులకు జరిమానాలు విధించారు. తాండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 500లకు పైగా ఈ కేసులు నమోదు చేసి రాష్ట్రంలో మొదటి పోలీస్‌స్టేషన్‌గా రికార్డు సాధించింది.  

కేసుల నమోదులోపోటీ పడుతున్న సీఐలు 

తాండూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న రెండు సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న సీఐల మధ్య ఈ పెట్టి కేసుల పోటీ కొనసాగుతోంది. ఒకరికి మించి ఒకరు తమ సత్తా చాటుకునేందుకు వాహనదారులపై కొరడా జులిపిస్తున్నారు. పట్టణ సీఐ ప్రతా పలింగం, రూరల్‌ సీఐ సైదిరెడ్డిల మధ్య ఇప్పటికే ఉద్యోగరీత్యా విభేదాలున్నాయి.

అధికారుల మధ్య సాగుతున్న అంతర్గత యుద్ధంలో ఈ పెట్టి కేసు నమోదులతో రికార్డు సాధించిన స్థానికంగా అధికారులు వాహనదారులపై అడ్డగోలుగా  కేసు లు నమోదు చేయడంతో విమర్శలు వస్తున్నాయి.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top