టీడీపీ నేత బొండా ఉమాపై కేసు | Case Registered Against Tdp Leader Bonda Uma | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత బొండా ఉమాపై కేసు

Mar 17 2024 7:37 AM | Updated on Mar 17 2024 7:37 AM

Case Registered Against Tdp Leader Bonda Uma - Sakshi

తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడసెంట్రల్‌): తన కుమారుడి మృతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ­ర­రావు, ఆయన అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల మరణించిన నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన యువకుడు కైకాల శరణ్‌ తల్లి అంజలీదేవి శనివారం అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

కేవలం రాజకీయ ప్రయోజ­నాల కోసమే వెలంపల్లి శ్రీనివాసరావు ఒత్తిడి చేయటం వల్ల తన కుమారుడు మృతిచెందాడని బొండా ఉమా, ఆయన అనుచరులు స్థానికంగా, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ స్వార్థం కోసం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని పేర్కొన్నారు.

తన కుమారుడి మృతిపై తప్పుడు ప్రచారం చేయడంతోపాటు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన బొండా ఉమా, బేతు రామ్మోహన్‌రావు, ఆల తారక రామారావు, పైడి శ్రీను, చలమలశెట్టి శ్రీను, హనుమంతరావు, విజయ్‌కుమార్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement