పట్టపగలే మహిళపై అత్యాచారయత్నం | rape attempt on woman in Bollaram | Sakshi
Sakshi News home page

పట్టపగలే మహిళపై అత్యాచారయత్నం

Mar 10 2014 5:08 PM | Updated on Jul 28 2018 8:51 PM

సికింద్రాబాద్ బొల్లారంలో ఓ మహిళపై పట్టపగలే దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బొల్లారంలో ఓ మహిళపై పట్టపగలే దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ మహిళపై దుండగుడు దాడి చేసి అత్యాచారం చేసేందుకు యత్నించటంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో అతడు మహిళను బ్లేడ్తో తీవ్రంగా గాయపరిచాడు.

మహిళ గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమచారం. పోలీసులు ఈ ఘటనపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement