ఒకే కాన్పులో ముగ్గురు మగశిశువులు జననం | Woman Delivers Triplets after Non ART Treatment at Gandhi Hospital | Sakshi
Sakshi News home page

గాంధీ ఐవీఎఫ్‌ సెంటర్‌లో అరుదైన ఘటన

Nov 21 2026 5:00 PM | Updated on Nov 21 2026 5:09 PM

Woman Delivers Triplets after Non ART Treatment at Gandhi Hospital

తల్లీబిడ్డలతో గాంధీ ఐవీఎఫ్‌ వైద్యులు, సిబ్బంది

తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ట్రిప్లెట్స్‌ 

సికింద్రాబాద్‌: సంతానం కోసం తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న దంపతుల కలను గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్‌ సెంటర్‌ వైద్యులు సాకారం చేశారు. ఓవులేషన్‌ ఇండక్షన్‌ పద్ధతిలో గర్భధారణ చేయగా ఒకే కాన్పులో ముగ్గురు మగశిశువులు జన్మించారు.

గాంధీ సూపరింటెండెంట్‌ ఉషారాణి, గైనకాలజీ హెచ్‌ఓడీ శోభ, ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ కృష్ణవేణి తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి పట్టణానికి చెందిన ఈశ్వర్, అవంతి (32) దంపతులు సంతానం కోసం గతంలో ఓ ప్రైవే­టు ఆస్పత్రిలో మల్టీపుల్‌ ఓవులేషన్‌ ఇండక్షన్, ఇంట్రా యూటరిన్‌ ఇన్‌సెమినేషన్‌ (ఐయూఐ) చేయించుకున్నా ఫలితం లేకపోయింది.

చివరి ఆశగా ఈ ఏడా­ది జనవరిలో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్‌ సెంటర్‌ను ఆశ్రయించా­రు. వైద్య చికిత్స సత్ఫలితాలివ్వడమే కాకుండా ఏకంగా ముగ్గురు శిశువులు గర్భంలో పెరుగుతున్నట్లు వైద్యులు తేల్చారు. అయితే 32 వారాల సమయంలో ఉమ్మనీరు బయటకు రావడంతో అక్టోబర్‌ 7న నెలలు నిండక ముందే డెలి­వరీ చేసి 1.5 కిలోల బరువుగల ఇద్దరు శిశువులను, 1.4 కిలోల బరువుగల మరో శిశువును బయటకు తీశారు.

శిశువులను ప్రత్యేక వైద్య సంరక్షణ కోసం ఎన్‌ఐసీయూకు తరలించారు. తల్లీబిడ్డలకు పూర్తి స్వస్థత చేకూరడంతో శుక్రవా­రం డిశ్చార్జి చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. 

ఇదీ చ‌ద‌వండి: మ‌హిళా భ‌ద్ర‌త‌కు హైకోర్టు మార్గదర్శకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement