రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 4న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. జులై 9 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్.. సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ వివరాలను పంచుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
‘పెద్ది’ కథేంటంటే..
1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడ 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్నా.. ఆ ఊరికి గుర్తింపే ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలి నడక ప్రయాణం తప్పుతుందని, అదే ఊరికి చెందిన అప్పల సూరి(జగపతిబాబు) 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరోవైపు ఆ ఊరికి చెందిన యువకుడు పెద్ది(పెద్ది) కూలీ పని చేస్తూ.. డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్‌లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరేట్ అయిన పెద్ది..ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. గౌర్నాయుడు(శివరాజ్‌కుమార్) శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి నేషనల్ పోటీల్లో పెద్ది గెలిచాడా లేదా? తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్‌తో పాటు మరో ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది నెరవేరిందా లేదా? ఈ కథలో అచ్చీయమ్మ( జాన్వీ కపూర్), రామ్ బుజ్జి( దివ్యేందు శర్మ) పాత్రలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


