‘ధర్మేంద్ర ప్రధాన్‌జీ హ్యాపీ బర్త్‌డే’ : సీజేపీ అభిజీత్‌ దీప్కే | Abhijeet Dipke Unique Birthday Wishes Too Dharmendra Pradhan, Demands Resignation Over Exam Row, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

‘ధర్మేంద్ర ప్రధాన్‌జీ హ్యాపీ బర్త్‌డే’ : సీజేపీ అభిజీత్‌ దీప్కే

Jun 26 2026 8:03 AM | Updated on Jun 26 2026 10:09 AM

Abhijeet Dipke wish to Dharmendra Pradhan

సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్‌’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్‌ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్‌.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్‌పోస్టర్‌పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత  ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement