‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్‌ కీలక ప్రకటన | CJP Founder Abhijeet Dipke Calls For Protest At Jantar Mantar On June 6 | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్‌ కీలక ప్రకటన

Jun 1 2026 4:11 PM | Updated on Jun 1 2026 4:14 PM

CJP Founder Abhijeet Dipke Calls For Protest At Jantar Mantar On June 6

ఢిల్లీ: సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్‌ 6న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని  పిలుపునిచ్చారు.    

వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్‌ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి  ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసేందుకు భారత్‌కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.

అయితే, అభిజీత్‌ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement