అమ్మాయిలకు సరైన భాగస్వామిని ఎన్నుకోవడం తెలియాలి..! | Upasana Konidela urges women to find their Ram before getting married | Sakshi
Sakshi News home page

పెళ్లి అంటే డబ్బు, హోదా కాదు..! అంతకంటే ముందు..: ఉపాసన కొణిదెల

Jul 8 2025 1:59 PM | Updated on Jul 8 2025 4:22 PM

Upasana Konidela urges women to find their Ram before getting married

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) వైస్‌ చైర్‌పర్సన్‌, నటుడు రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల (Upasana Konidela) మహిళల హక్కులు, గౌరవానికి సంబంధించి సదా తన గళం వినిపిస్తుంటారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసే ఆమె ఈసారి మహిళలు వైవాహిక బంధంలో అగుపెట్టడానికి ముందే ఈ విషయాలను తెలుసుకోవాలంటూ కొన్ని సూచనలందిస్తూ నెట్టింట పోస్ట్‌ పెట్టారు. అలాగే వైవాహిక బంధం బంధనంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అని పోస్ట్‌లో యువతకు పిలుపునిచ్చారు. అంతేగాదు కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో మహిళలకు అమూల్యమైన సలహలిచ్చారు ఉపాసన కొణిదెల. అవేంటో ఆమె మాటల్లోనే చూద్దామా..!.

తనకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న మహిళను అన్నది వాస్తవమేనని అన్నారు. అదేటైంలో అలాంటి సౌకర్యాలు లేకపోయినా మహిళలు ఆ అడ్డంకులను అధిగమించి ఎలా ఎదగొచ్చో చెప్పారు. "ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళలకు పెళ్లితోనే జీవితం ఇంటికే పరిమితమైపోతోంది. రాను రాను తనకు తెలియకుండానే ఆ వైవాహిక బంధం బంధనంగా మారిపోతుంది. అయితే కొందరూ ఆర్థిక స్వతంత్రతను పొందుతున్నారు. తమ చుట్టూ ఉన్న పురుషులకంటే గొప్ప గొప్ప విజయాలను అందుకుంటున్నారు. 

ఆఖరికి తమ పిల్లలను కూడా పురుషుల సాయం లేకుండా వారే స్వయంగా పెంచి, ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇవే మనకు స్ఫూర్తి. ముఖ్యంగా పెళ్లికి ముందే మీ వ్యక్తిత్వాన్ని గౌరవించే సరైన భాగస్వామిని ఎంచుకోవాలని. ఆ విషయంలో ప్రతి మహళకు ఆలోచన తీరు మారాలి. మార్పుకి స్వాగతించాలి. బహుశా ఇది చెప్పినంతా సులవు కాకపోవచ్చు కానీ సాధ్యమైతే కాదు కదా..!.". అని అన్నారు ఉపాసన. 

ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం..భారతదేశంలో సగం హత్యా నేరాలకు వైవాహిక సమస్యలు కూడా కారణమని అన్నారామె. అందువల్ల మహిళలు భాగస్వామి ఎంపికలో సరైన నిర్ణయమే ఆమె భవిష్యత్తుకి, మంచి కుటుంబాన్ని నిర్మించడానికి కీలకమైనదని గ్రహించాలని అన్నారు. బలమైన భారత దేశం మన ఇంటి నుంచే మొదలవుతుందని గుర్తు చేశారామె. గౌరవప్రదమైన కుటుంబాలతో మంచి సమాజం..తద్వారా బలమైన భారతదేశం నిర్మితమవుతుందని అన్నారు. 

తప్పక లేక ఇంట్లో వాళ్ల బలవంతం వల్ల భయంతోనే పెళ్లి చేసుకునే పరిస్థితిని అమ్మాయిలకు కల్పించొద్దన్నారు. వాళ్లు వైవాహిక బంధంలోకి ఆనందంగా అడుగుపెట్టేలా ప్రొత్సహించాలని పిలుపునిచ్చారు. ఏదో డబ్బు, హోదా కోసం పెళ్లి చేసుకోకూడదని, మంచి భాగస్వామి లభిస్తే అవన్నీ ఆటోమేటిగ్గా ఇద్దరు కలిసి సులభంగా సాధించగలరని అన్నారామె. 

అవసరం అనుకుంటే మనమే అబ్బాయిలకు అమ్మాయిల ఆత్మగౌరవానికి భంగ కలగుండా ఎలా మెలగాలో నేర్పిద్దామని చెప్పారు. అలాగే అమ్మాయిలు సరైన భాగస్వామి లభించేంత వరకు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారామె. మిమ్మల్ని గౌరవంగా చూసుకుని, అన్ని విషయాల్లో అండదండ అందించి, మీకు బలంగా ఉండే వ్యక్తి దొరికే వరకు ఎదురు చూడటంలో తప్పులేదంటూ పోస్ట్‌ ముగించారు ఉపాసన.

 

(చదవండి: ఆ అధికారిణి ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే..! భారీ కింగ్‌ కోబ్రానే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement