మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు కాస్తా గ్యాప్ దొరికింది. దీంతో మన మెగా హీరో చెర్రీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మెగా హీరో రామ్ చరణ్ స్పెషల్‌గా పార్టీ చేసుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా తయారు చేసిన బిర్యానీ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ పార్టీలో కనిపించారు. ఇంట్లోనే జపాన్ చెఫ్ వండిన బిర్యానీ తింటూ కనిపించారు. ఈ పార్టీలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించిన ఉపాసన.. బేబీ బంప్‌తో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
@ #RamCharan 🏦 pic.twitter.com/0AsYvJiJwm
— Trends RamCharan ™ (@TweetRamCharan) January 5, 2026


