తెలుగు తెరపై మరో అందాల సుందరి | silpa singh acts in telugu film | Sakshi
Sakshi News home page

తెలుగు తెరపై మరో అందాల సుందరి

Jul 12 2014 12:06 AM | Updated on Sep 2 2017 10:09 AM

తెలుగు తెరపై మరో అందాల సుందరి

తెలుగు తెరపై మరో అందాల సుందరి

అందాల సుందరి టైటిల్ గెల్చుకున్న ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ వంటివారు సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందాల సుందరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు.

అందాల సుందరి టైటిల్ గెల్చుకున్న ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ వంటివారు సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందాల సుందరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ బ్యూటీ పేరు శిల్పా సింగ్. రెండేళ్ల క్రితం ‘ఐయామ్ షి-మిస్ యూనివర్శ్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఆమె ఓ తెలుగు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఎమ్.జి. మరియు ఎమ్.ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనూప్ బండారీ దర్శకుడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శిల్పా సింగ్ ప్రధాన పాత్ర చేయనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర చేయనున్నారు. నిరూప్, అవంతికా శెట్టి, రాధికా చేతన్ హీరో, హీరోయిన్లు. ‘వర్డ్స్’ అనే షార్ట్ ఫిలింతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అనూప్‌ని మా సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మురళి గంధర్వ, సంగీతం: ఆగం రాక్ బ్యాండ్.

Advertisement
 
Advertisement
Advertisement