breaking news
HPV
-
HPV వ్యాక్సిన్ అంటే ఏంటి ..? ఇది బాలికలకి వేయవచ్చా?
-
జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ: జండర్ న్యూట్రల్(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను ఎంఎస్డీ ఫార్మా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ హెచ్‌పీవీ వైరస్ టీకా హెచ్‌పీవీ టైప్స్ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గార్డ్‌సిల్9 విడుదల ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక మలుపని కంపెనీ డైరెక్టర్ రెహాన్ ఖాన్ చెప్పారు. ఈ వైరస్లు ఆడవారికి, మగవారికి సోకుతాయి, అందువల్లనే జెండర్ న్యూట్రల్(ఎవరైనా తీసుకోగలిగేది) టీకా తెచ్చామన్నారు. పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రివెంటివ్ కేర్ గురించి, హెచ్‌పీవీ దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు చర్యలు అవసరమన్నారు. (కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!) -
ఆమెకు రక్ష
సాక్షి, హైదరాబాద్: సర్వైకల్ కేన్సర్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కేన్సర్ విస్తరణ, అరికట్టాల్సిన అవసరంపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి డాక్టర్లు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ చేర్చాలని సూచించారు. అంతేకాదు, ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్‌పై తరగతులను నిర్వహించనున్నారు. కేన్సర్‌ను సులభంగా గుర్తించే (డయాగ్నైజ్) పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను బాధిస్తున్న రోగాల్లో సర్వైకల్ కేన్సర్ ఒకటి. మన దేశంలో ప్రతి సంవత్సరం 60 వేల మందికి పైగా ఈ కేన్సర్‌తో మరణిస్తున్నారు. ఏటా సగటున 97 వేల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలోనూ సర్వైకల్ కేన్సర్ ప్రభావం ఉంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌లో భాగంగా చేపడుతున్న సర్వేలో సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు 7 వేల అనుమానిత కేసులను గుర్తించారు. దీనిపై గతంలో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి బృందాలు పలు ప్రాంతాల్లో స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించాయి. సెక్సువల్ ఇన్ఫెక్షన్తో సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) సర్వైకల్ కేన్సర్‌కు దారితీస్తుంది. ఈ వైరస్‌ను టీకాలతో కంట్రోల్ చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సర్వైకల్ కేన్సర్‌ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఈ టీకాపై ఉన్న అపోహతో ఇప్పటివరకు ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఇటీవల ఈ టీకాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చేర్చింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. -
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్లు
గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోక పోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత మూడు డోసులు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సెర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలగుతాము. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ స్త్రీలలో ప్రధానంగా ఉన్నా వ్యాక్సిన్స్ వేయించుకోవటం వల్ల, పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకుని ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చికిత్స తీసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా, ఒకవేళ గురయినా చికిత్సతో బయటపడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం కొంతవరకు మంచిపరిణామం అని చెప్పుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హెచ్.పి.వి. వైరస్‌లో 16, 18 రకాలు, అవి సోకకుండా వ్యాక్సిన్స్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరుదుగా ఇతర కారణాలవల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకనే డాక్టర్ సలహా మేరకు అప్పుడప్పుడు పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి? ఒకసారి తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్ స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా లేటుగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. మొదట్లో లక్షణాలు అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని పొరబడటం వల్ల తొలిదశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తించలేకపోవచ్చు. లక్షణాలు: ∙పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు యోని స్రావాలు అసాధారణంగా, మూత్రం ఎక్కువగా రావటం అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్ ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్ గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియవ్ు, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు టొమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కన్పిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్ ఇది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి బయటకు కన్పించే అవయవం, యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్‌కు గురయితే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టతరం, క్యాన్సర్‌ను అదుపులో పెట్టి జీవితకాలం పెంపొందించటమూ అంత సులువేమి కాదు. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకస్ స్లీ్కరోసిస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకస్ స్లీ్కరోసిస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ∙పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటంతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యమే. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా.. నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది. ఇక మరో వైపు ఇదే ఫోటో పై కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు.