ఆదివారం వచ్చిందంటే చాలు బిగ్‌బాస్ హౌస్‌లో కచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. ఈసారి అలానే షాలిని ఔట్ అయింది. కాకపోతే చివరలో ట్విస్ట్ ఇచ్చిన హౌస్ట్ నాగార్జున, ఆమెని సీక్రెట్ రూంలోకి పంపించాడు. దీంతో అసలు కథ మొదలైంది. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది? హైలైట్స్ ఏంటనేది చూద్దాం.
(ఇదీ చదవండి: 7 నిమిషాల్లో 'సినిమా' చూపించేశారు)
ఎంట్రీ ఇచ్చిన నాగ్.. నామినేషన్లలో ఉన్న వాళ్లని సేవ్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టాడు. ఆరుగురిలో వంశీ, కెప్టెన్ రాంప్రసాద్ సేవ్ అయ్యారు. ఇక హోస్ట్ వచ్చిన తర్వాత అంటే ఆలస్యంగా రావడంతో షాలినిని నామినేషన్ ప్రాసెస్‌లోకి రావొద్దని పక్కనపెట్టాడు. కాసేపటి తర్వాత పిలిచి నాట్ సేఫ్ అని చెప్పాడు.
ఇంటి సభ్యులను రెండు టీమ్స్‌గా విడదీసి ప్రాపెర్టీ వాడి డ్యాన్స్ చేయమని నాగ్ డ్యాన్స్ చేయమని చెప్పాడు. కాసేపు పాటలు, డ్యాన్సులతో హౌస్ సందడిగా సాగింది. తర్వాత షాలిని కాళ్లమీద రామకృష్ణ పడటం గురించి డిస్కషన్ మొదలైంది. అన్నిసార్లు సారీ చెప్పడం కరెక్ట్ కాదు, అంత అవసరం లేదని నాగ్ అన్నాడు. అనంతరం నామినేష్లలో ఉన్నవాళ్లలో అమన్ సేఫ్ అయ్యాడు. స్టార్ ఆఫ్ ది వీక్‌గా రాంప్రసాద్ నిలిచాడు.
తర్వాత నామినేషన్లలో ఉన్న రోహిత్ సేవ్ అయ్యాడు. చివరగా షాలిని, వర్షిణి మిగలగా వాళ్లలో షాలిని ఎలిమినేట్ అయింది. దీంతో రోహిత్ వెక్కివెక్కి ఏడ్చాడు. గేమ్ బాగా ఆడు.. విన్నర్ ట్రోఫీ తీసుకొని రా అంటూనే లవ్‌యూ అని రోహిత్‌కి ముద్దుపెట్టి మరీ షాలిని చెప్పింది. షాలిని రోహిత్‌ని హగ్ చేసుకొని చాలాసేపు మాట్లాడింది.
అనంతరం స్టేజీ మీదకు వచ్చిన షాలిని.. తన ఏవీ చూసుకుని మురిసిపోయింది. తర్వాత ఇంటిసభ్యులతో నాగ్ మాట్లాడించాడు. నా జర్నీ మొత్తం నువ్వే ఉన్నావ్‌రా. చాలా బాగుంది మన జర్నీ అని రోహిత్‌తో షాలిని చెప్పింది. నీ ప్లేస్‌లో ఎవరు ఎలిమినేట్ అవాల్సింది, ఓ ముగ్గురు పేర్లు చెప్పు అని నాగ్ అనగానే వంశీ, సుధీర్, వర్షిణిల పేర్లు చెప్పింది. ఇక షాలిని వెళ్లిపోతుంటే నాగ్ పిలిచి నువ్వు ఎవిక్ట్ అవ్వలేదు సీక్రెట్ రూంకి వెళ్తున్నావ్ అని చెప్పి షాకిచ్చాడు. తర్వాతి వారం 'గోట్-గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అని చెప్పిన నాగ్.. ఆదివారం ఎపిసోడ్ ముగించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)


