ప్రతిసారి బిగ్‌బాస్ షోలో ఐదోవారం వచ్చిందంటే చాలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. ఈసారి కూడా అలానే ఉండబోతున్నాయి. ప్రస్తుతానికైతే హౌస్‌లో 14 మంది ఆడుతున్నారు. వీళ్లలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ గండం ఉండొచ్చని తెలుస్తోంది. అదే టైంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చేవాళ్లు పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నా.. ఈసారిలా ఎప్పుడూ జరగలేదు:తమన్నా)
ఏడో సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చిన సీరియల్ నటి ప్రియాంక ప్రియుడు శివకుమార్.. ఈసారి హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం చేస్తున్న 'నిన్ను కోరి' సీరియల్ నుంచి తప్పుకోవడంతో ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. చెప్పాలంటే ప్రారంభం నుంచే వస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా మధ్యలో వస్తున్నాడనమాట.
తెలుగు రియాలిటీ షోలతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్.. గతంలో ప్రసారమైన బిగ్‌బాస్ 5, ఓటీటీ సీజన్‌లో పాల్గొని తనదైన ఆవేశం చూపించాడు. కానీ విజేతగా నిలవలేకపోయాడు. ఇప్పుడు ఇతడి భార్య నీతు.. 10వ సీజన్ కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఈమె పేరు కూడా ఖరారైందని అంటున్నారు.
ఈసారి అగ్నిపరీక్ష షోలో పాల్గొన్న శ్రీకాకుళం కుర్రాడు 'నవరసాలు రామకృష్ణ' కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలా సెలెక్ట్ అయ్యాడట. ఇప్పటికే ఒకసారి మిథిలేశ్, అపూర్వతో కలిసి హౌస్‌లోకి వచ్చాడు. కానీ మిథిలేశ్‌తో టాస్క్‌లో ఓడిపోయి వెళ్లిపోయాడు. ఇప్పుడు మాత్రం వైల్డ్ కార్డ్‌లా ఎంట్రీ ఇస్తాడని టాక్.
వీళ్లతో పాటు 8వ సీజన్ విజేతగా నిలిచిన నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యశ్రీ, జబర్దస్త్ ఫేమ్ నూకరాజు, రాకింగ్ రాకేశ్ పేర్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరెవరు వస్తారనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ)


