చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నా.. ఈసారిలా ఎప్పుడూ జరగలేదు | Tamannaah Bhatia Tirumala Latest Darshan News | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: తృప్తిగా లక్కీగా ఫీలవుతున్నా.. శ్రీవారి సేవలో తమన్నా

Oct 7 2026 12:51 PM | Updated on Oct 7 2026 12:59 PM

Tamannaah Bhatia Tirumala Latest Darshan News

స్టార్ హీరోయిన్ తమన్నా.. తిరుమలలో కనిపించింది. బుధవారం వేకువజామున సుప్రభాత సేవలో కుటుంబంతో పాటు పాల్గొంది. తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని.. కానీ ఈసారి దర్శనం లాంటిది ఇప్పటివరకు జరగలేదని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఏడాది తిరిగేసరికి మళ్లీ తల్లి కాబోతున్న 'టాక్సిక్' హీరోయిన్)

'చాలారోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగింది. అందరి కోసం ప్రార్థించాను. ఇక్కడికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చాలా తృప్తిగా లక్కీగా ఫీలవుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన దర్శనం లాంటిది నేను ఇప్పటివరకు చూడలేదు' అని తమన్నా చెప్పింది.

తెలుగులో చివరగా 'ఓదెల 2' సినిమాలో కనిపించిన తమన్నా.. ప్రస్తుతానికైతే హిందీ, తమిళంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement