హౌస్‌లో కన్నింగ్‌ నువ్వే.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్.. వీకెండ్‌ ఎపిసోడ్‌ హైలెట్స్ ఇవే..! | Bigg Boss Season 10 Telugu latest Episode highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss Season 10: హౌస్‌లో కన్నింగ్‌ నువ్వే.. ఆ ముగ్గురికి ఎల్లో కార్డ్.. వీకెండ్‌ ఎపిసోడ్‌ హైలెట్స్ ఇవే..!

Oct 4 2026 7:24 AM | Updated on Oct 4 2026 7:34 AM

Bigg Boss Season 10 Telugu latest Episode highlights

బిగ్‌బాస్ సీజన్ 10 మరింత ఆసక్తికరంగా మారుతోంది. వీకెండ్ ఎపిసోడ్‌ వచ్చిందంటే చాలు.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఇంట్రెస్టింగ్‌ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో నాలుగో వారం ఎండ్‌కు వచ్చేసింది. గతవారం మిథిలేష్.. రూ.15 లక్షలు తీసుకుని బయటకెళ్లిపోవడంతో ఎలిమినేషన్ జరగలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా ఒకరు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలుస్తోంది.

అయితే వీకెండ్‌ ఎపిసోడ్‌లో నాగార్జున కంటెస్టెంట్ల చేసిన తప్పులను చర్చిస్తుంటారు. హౌస్‌లో ఎవరితో ఎవరు ఎలా ఉన్నారు? అని తేల్చేస్తారు. అలా వార్నింగ్‌లతో పాటు కంటెస్టెంట్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తుంటారు. అందుకే ఈ వీకెండ్ ఎపిసోడ్‌ ఫుల్ హాట్‌హాట్‌గా సాగుతోంది. నాగ్ వచ్చిన ఈ వారం వీకెండ్‌లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూసేద్దాం.

అయితే ఈ వారంలో కెప్టెన్‌గా వ్యవహరించిన అపూర్వకు నాగార్జున షాకిచ్చాడు. కెప్టెన్‌గా రూమ్ వాడిన విధానాన్ని తప్పుపట్టారు. నువ్వు ఒక డిజాస్టర్ కెప్టెన్‌ అని అపూర్వకు ఝలక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఆటో రామ్‌ప్రసాద్‌కు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వేమైనా పిస్తావా అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. నామినేషన్స్‌ విషయం డిస్కస్‌ చేయొద్దని చెప్పాం కదా అన్నాడు. అందుకే నిన్ను కన్నింగ్ అని పిలుస్తారని నాగ్‌ అన్నారు.

ఆ తర్వాత షాలినిని షాలినికి నాగ్ ఇచ్చిపడేశాడు. ఎఫ్‌ అనే అనే బూతు ఏంటని నిలదీశారు.  నీ భాష ఆడియన్స్ వింటే మిమల్ని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపేస్తారని చెప్పారు. అంతేకాకుండా అన్నింటికి పెద్ద పెద్దగా అరుస్తున్నావ్.. ముందు నీ ఆట తీరు మార్చుకో అని స్వీట్ వార్నింగ్ ఇ‍చ్చారు. అమన్‌ని లివింగ్ రూంకి పిలిచి ఈ వారం ఆట ఎలా ఆడావని అడుగుతారు. అమన్ చెప్పగానే.. వెంటనే ఎల్లో కార్డు చూపించి ఇంకోసారి నువ్వు ఒక్క తప్పు చేసినా వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతావ్.. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అని నాగ్ చెప్తారు.

త్రిగుణ్‌ని పిలిచి నాగ్ వార్నింగ్ ఇస్తాడు. ఇది నీ ఇల్లు కాదు.. నీకు నచ్చినట్లు ఉండటం కాదు.. అని త్రిగుణ్‌కి కూడా నాగ్ పసుపు ఎల్లో కార్డ్ చూపిస్తాడు.  ఆ తర్వాత నాగ్ ఇంటి తలుపులు ఓపెన్ చేయిస్తారు. ఆ తర్వాత చరణ్, రోహిత్ మధ్య జరిగిన సంభాషణ వీడియోను చూపిస్తారు. అందులో రోహిత్ చరణ్‌తో సైలెంట్‌గా బూతులు మాట్లాడతాడు. అవి విన్నాక బిగ్‌బాస్ నన్ను ఏం పీకలేడు అదే కదా నీ ఉద్దేశం అని నాగ్ అంటారు. అందరూ రోహిత్‌ది తప్పు ‍అనడంతో.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో అని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు.  దీంతో రోహిత్ క్షమాపణలు చెప్తాడు.  చివరికీ నాగ్ రోహిత్‌కి ఎల్లోకార్డు చూపిస్తారు. ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ డోర్స్ క్లోజ్ చేయించి రోహిత్‌ని పిలుస్తారు. ఆ తర్వాత రోహిత్.. సృష్టితో వ్యవహరించిన తీరును నాగ్ ఎత్తిచూపిస్తారు. రోహిత్ డ్రమ్ తన్నేసిన వీడియో చూపించడంతో.. రోహిత్ చాలా తప్పు చేశాడని హౌస్‌మేట్స్ అంటారు.  ఆటలో ఉన్మాదం వద్దు.. ఇలాంటి రోజు మళ్లీ రాకూడదని నాగ్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement