‘అతనికి ఈత వచ్చు సార్‌’ నరేశ్‌ ఆన్సర్‌కు నవ్వులే... | Bigg Boss 10 Telugu Latest Promos | Sakshi
Sakshi News home page

ఝాన్సీకి నిరాసే.. ‘ఇందేటి సార్‌ అంటూ’..

Oct 4 2026 3:38 PM | Updated on Oct 4 2026 3:56 PM

Bigg Boss 10  Telugu Latest Promos

బిగ్‌బాస్‌ తెలుగు 10లో ఆదివారం ఎపిసోడ్‌ ఫుల్‌ ఫన్‌తో సాగినట్లు తాజా ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది. ఎలిమినేషన్‌ టెన్షన్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చిన హోస్ట్‌ నాగార్జున.. కంటెస్టెంట్లతో సరదా గేమ్స్‌ ఆడించారు. డ్యాన్స్‌లు చేయిస్తూ, ప్రశ్నలు అడుగుతూ.. మధ్యలో చాక్లెట్లు ఇస్తూ ఇంట్లో నవ్వులు పూయించారు.

సినిమా పాటలకు డ్యాన్స్‌లు
‘సండే ఫన్‌డే’ గేమ్‌లో భాగంగా నాగార్జున కొన్ని ప్లేకార్డ్స్‌ చూపించారు. వాటిని చూసి సినిమా పేరును కంటెస్టెంట్లు గుర్తించాలని చెప్పారు. సరైన సమాధానం చెప్పిన తర్వాత ఆ సినిమాలోని పాటలకు డ్యాన్స్‌ చేయించారు. దీంతో కంటెస్టెంట్లు ఉత్సాహంగా స్టెప్పులేయగా.. నాగార్జున కూడా వారితో కలిసి సందడి చేశారు.

చాక్లెట్ల కోసం ఝాన్సీ ఎదురుచూపులు
మరో ప్రోమోలో నాగార్జున కంటెస్టెంట్లతో మరో సరదా గేమ్‌ ఆడించారు. ‘ఓ ప్రశ్న అడుగుతా.. దానికి సరైన సమాధానం చెబితే చాక్లెట్‌ ఇస్తా’ అని చెప్పారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన దేబ్జానీ, నరేశ్‌లకు నాగార్జున చాక్లెట్లు అందించారు. అయితే చాక్లెట్ల కోసం ప్రతిసారీ ముందుకొచ్చిన రైతుబిడ్డ ఝాన్సీకి మాత్రం ఒక్కసారి కూడా చాక్లెట్‌ దక్కలేదు. దీంతో ‘ఇదేంటి సార్‌.. నాకు మాత్రం రావడం లేదు’ అంటూ ఝాన్సీ చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.

పడవలో ఎవరిని ముంచుతారు?
ఇక మరో సరదా ప్రశ్నతో కంటెస్టెంట్లను ఇరుకున పెట్టారు నాగార్జున. ‘మీ పడవకు ప్రమాదం వచ్చింది. పడవలో ఎవరిని కాపాడతారు? ఎవరిని ముంచేస్తారు?’ అని అడిగారు. దానికి ముకేశ్‌ స్పందిస్తూ.. వర్షిణిని సేవ్‌ చేస్తానని, సుదీర్‌ను ముంచేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నరేశ్‌ను ఇదే ప్రశ్న అడగ్గా.. రాంప్రసాద్‌ను ముంచేస్తానని, దేబ్జానీని సేవ్‌ చేస్తానని చెప్పాడు. అందుకు కారణం ఏంటని నాగార్జున అడగ్గా.. ‘అతనికి ఈత వచ్చు సార్‌’ అంటూ నరేశ్‌ ఇచ్చిన సమాధానం అందరినీ నవ్వించింది. ఇలా ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి కంటెస్టెంట్లు చేసిన సందడి, సరదా గేమ్స్‌ ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: షారుక్‌, అమితాబ్‌లను మించిన సంపన్నుడు.. ఏకంగా 36000 కోట్లు

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement