బాలీవుడ్‌లో రిచెస్ట్‌ సెలబ్రిటీ.. ఆస్తి ఏకంగా రూ. 36,000 కోట్లు..! | Meet Bollywood richest celeb Bhushan Kumar beats Shah Rukh Khan Amitabh Bachchan Salman Khan | Sakshi
Sakshi News home page

షారుక్‌, అమితాబ్‌లను మించిన సంపన్నుడు

Oct 4 2026 2:57 PM | Updated on Oct 4 2026 3:56 PM

Meet Bollywood richest celeb Bhushan Kumar beats Shah Rukh Khan Amitabh Bachchan Salman Khan

బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో షారుక్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్‌ వంటి అగ్ర కథానాయకుల ఉంటారు. ఇది జగమెరుగని సత్యం అనే చెప్పాలి. అయితే సంపద విషయంలో మాత్రం సినిమా హీరోలను మించిన ఆస్తి ఓ నిర్మాత కుటుంబం ఉందని కొంతమందికే తెలుసు. సినిమాలతో పాటు వ్యాపారాలు, బ్రాండ్‌లు, పెట్టుబడులు ఇలా భారీగా కూడబెట్టడంతో ఆ కుటుంబం బాలీవుడ్‌లోనే అత్యంత ధనికంగా నిలిచింది. మరి వారు ఎవరు? ఏంటో ఒకసారి చూద్దామా...

టీ సిరీస్‌ ఛైర్మన్‌..
2026 టీ-సిరీస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భూషణ్‌ కుమార్‌, ఆయన కుటుంబం మొత్తం సంపద విలువ సుమారు రూ.36,300 కోట్లుగా ఉన్నట్లు హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ నివేదిక(2026) వెల్లడించింది. దీంతో బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుడిగా భూషణ్‌ కుమార్‌ కుటుంబం ఉండడంతో పాటు టాప్‌ 100 సంపన్నుల జాబితాలో భూషణ్‌ కుమార్‌ 87వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

షారుక్‌ ఖాన్‌ను మించిన సంపద
భారత్‌లో అత్యంత ధనిక నటుడిగా కొనసాగుతున్న షారుక్‌ ఖాన్‌ సంపదతో పోలిస్తే భూషణ్‌ కుమార్‌ కుటుంబ ఆస్తులు భారీగా ఉన్నాయి. షారుక్‌ ఖాన్‌ నికర సంపద సుమారు రూ.10,000 కోట్లుగా హురున్‌ నివేదిక పేర్కొంది. అంటే భూషణ్‌ కుమార్‌ కుటుంబ సంపద షారుక్‌ కంటే మూడు రెట్లకు పైగా ఉండటం విశేషం.
అయితే గత ఏడాదితో పోలిస్తే షారుక్‌ ఖాన్‌ సంపదలో సుమారు రూ.2,490 కోట్ల మేర తగ్గుదల నమోదైనట్లు నివేదిక తెలిపింది. అయినప్పటికీ 2026 హురున్‌ గ్లోబల్‌ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సెలబ్రిటీగా షారుక్‌ నిలిచారు. అంతర్జాతీయంగా జే-జెడ్‌, టేలర్‌ స్విఫ్ట్‌, రిహానా వంటి ప్రముఖులతో ఆయన ఈ జాబితాలో ఉన్నారు.

అమితాబ్‌ బచ్చన్‌ సంపద ఎంతంటే?
బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా భారీగా సంపద పెంచుకున్నారు. 2025లో సుమారు రూ.1,630 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు.. 2026లో రూ.4,000 కోట్లకు చేరినట్లు హురున్‌ జాబితా వెల్లడించింది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల ద్వారా ఆయన సంపద గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

సల్మాన్‌, హృతిక్‌ కూడా టాప్‌లో..
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఈ ఏడాది తొలిసారి హురున్‌ రిచ్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద విలువ సుమారు రూ.3,000 కోట్లుగా నమోదైంది. ఇక హృతిక్‌ రోషన్‌ సుమారు రూ.2,500 కోట్ల ఆస్తులతో ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఇదీ చదవండి: సుకుమార్ ఇంటిచుట్టూ మూడేళ్లు తిరిగితే చివరకు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement