బిగ్‌బాస్ తెలుగు 10లో ఐదో వారం ఆట ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే టాస్కుల్లో అదరగొట్టిన అమన్, త్రిగుణ్ సేఫ్ అయ్యారు. మరోవైపు లీడర్‌బోర్డులో మార్కుల ఆధారంగా మిగిలిన కంటెస్టెంట్ల మధ్య పోటీ నెలకొంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ టాస్క్‌లో జరిగిన ఆసక్తికర పరిణామాలు కనిపించాయి. తక్కువ మార్కులతో ఉన్న షాలినీ, రోహిత్ జంట డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ముకేశ్ వింత చేష్టలు.. అపూర్వకు షాక్!
ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్ టాస్కులో భాగంగా మొదట ముకేశ్ డైస్ తీసుకున్నాడు. ఐదు రకాలుగా వివిధ చేష్టలు చేయాలనే టాస్క్ రావడంతో వింతగా నటిస్తూ నవ్వించాడు. ఆ తర్వాత అపూర్వ వంతు వచ్చింది. ఇంట్లోని వారంతా కలిసి ఒకరిని బయటకు పంపించాలనే టాస్క్ ఆమెకు ఎదురైంది. దీంతో కంటెస్టెంట్లంతా చర్చించుకుని అపూర్వ పేరును సూచించడంతో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.
నరేశ్ ఫ్లిప్ చేయగా డైస్ రోల్ చేసి అత్యధిక నంబర్ వచ్చిన వ్యక్తిని ఎలిమినేట్ చేయాలనే టాస్క్ వచ్చింది. ఈ క్రమంలో నరేశ్, చరణ్, రామ్ ప్రసాద్‌లకు ఒకటి చొప్పున రాగా.. ముకేశ్‌కు రెండు, షాలినీకి ఐదు వచ్చాయి. అందరిలోనూ అత్యధిక సంఖ్య షాలినీకే రావడంతో ఆమె ఈ టాస్కులో ఎలిమినేట్ అయింది.
నవ్వించిన నరేశ్!
మరోవైపు ముకేశ్‌కు దోమలా నటించాలనే టాస్క్ వచ్చింది. దీంతో దేబ్జానీ చుట్టూ తిరుగుతూ ఆమెను ఆటపట్టించాడు. 'ఈమె దగ్గర బ్లడ్ స్మెల్ కంటే బటర్ స్మెల్ వస్తోందేంటి?' అంటూ కామెడీ చేశాడు. తర్వాత షాలినీ దగ్గరకు వెళ్లగా.. 'ఈ దోమ ఏంటి.. మీద వాలుతోంది కానీ ఏం చేయడం లేదు' అని షాలినీ అనడంతో ‘పక్కనే డేంజర్ బెల్ ఉంది’ అని ముకేశ్ అనడంతో నవ్వులు పూశాయి. వర్షిణితోనూ ముకేశ్ సరదాగా ఫ్లర్ట్ చేశాడు. 'ఏ ఊరి సుందరో తెలియడం లేదు కానీ.. రంభ, ఊర్వశి, మేనక వేస్ట్' అంటూ ఆమెను పొగిడాడు. తర్వాత నరేశ్‌ను దోమలా నటించమని బిగ్‌బాస్ కోరగా.. అతడు కూడా దోమలా మారిపోయి.. వర్షిణి దగ్గరకు వెళ్లి మొత్తం రక్తం పీల్చేస్తానంటూ కామెడీ చేశాడు.మరి ఈ టాస్కుల ప్రభావం కంటెస్టెంట్ల తదుపరి ఆటపై ఎలా ఉంటుందో చూడాలి.
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌తో తమన్ డ్యాన్స్.. జోష్‌లో మ్యూజిక్ డైరెక్టర్..)


