బిగ్‌బాస్ 10: ఆట మార్చేసిన ఝాన్సీ.. డేంజర్ జోన్‌లో ప్రేమపక్షులు | Bigg Boss 10 Telugu Day 33 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 33: కొత్త కెప్టెన్ సుధీర్.. శుక్రవారం ఏం జరిగిందంటే?

Oct 10 2026 8:24 AM | Updated on Oct 10 2026 8:24 AM

Bigg Boss 10 Telugu Day 33 Episode Highlights

గ్రూపులుగా టాస్క్‌లు పెట్టి నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకుంటూ వస్తున్న బిగ్‌బాస్.. కెప్టెన్ అయ్యేందుకు కూడా టాస్క్, గేమ్స్ ఆడించాడు. అలా ఈసారి కొత్తగా ఇంకొకరు కెప్టెన్ అయ్యారు. ముందుచూపుతో ఆలోచించిన ఝాన్సీ.. పక్కా ప్లాన్ వేసి నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. ఇంతకీ శుక్రవారం(అక్టోబర్ 09) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో నన్ను తొక్కేస్తున్నారు: స్టార్ హీరోయిన్)

బిగ్‌బాస్ లీడర్‌ బోర్డ్‌లో చివరి స్థానాల్లో ఉన్న రోహిత్-షాలిని.. ముకేశ్-ఝాన్సీల గ్రూప్స్‌లో ఇద్దరు డేంజర్‌ జోన్‌లో ఉంటారు. మరో ఇద్దరు ఓ టీమ్‌గా మారి అయి ముందుకు వెళ్తారని బిగ్‌బాస్ చెప్తాడు. రోహిత్ డేంజర్‌ జోన్‌లో ఉంటే.. ఝాన్సీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయి తన పవర్ వాడుతానని చెప్పి ముకేశ్‌ని ముందుకెళ్లమని చెప్పింది.

తర్వాత అపూర్వ, చరణ్‌, రాంప్రసాద్, నరేశ్, ముకేశ్, షాలినికి 'ఫ్లిప్ చేయ్-ఫేస్ చేయ్' టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటుచేసిన టైల్స్‌ని తిరగేయాలి. వాటిలో టాస్క్ వస్తే అది పూర్తి చేయాలి. ఇంటి సభ్యులు ఓటు వేసి ఒకరిని గేమ్ నుంచి అవుట్ చేయాలి అనడంతో అంతా కలిసి అపూర్వని తీసేశారు. తర్వాత డైస్ వేసి ఎవరికి పెద్ద నంబర్ వస్తే వాళ్లు గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి అని వడంతో షాలిని ఎలిమినేట్ అయిపోయింది. 'యూ ఆర్ ఎలిమినేటెడ్‌' టైల్ రావడంతో ముకేశ్, గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత డ్యాన్స్ వేసి అందులో ఒకరిని ఎలిమినేట్ చేయాలని అనడంతో రాంప్రసాద్, చరణ్‌లలో చరణ్‌ని అందరూ ఎలిమినేట్ చేశారు. చివరగా ఈ గేమ్‌లో రాంప్రసాద్‌, నరేశ్ గెలిచారు.  

అనంతరం రోహిత్ అపూర్వ ని తనబ్యాచ్ లో కలుపుకుందామని మాట్లాడటానికి ట్రై చేద్దామంటే షాలిని గొడవ పెట్టుకుంది అపూర్వతో. ఇక లీడర్‌ బోర్డ్‌లో రాంప్రసాద్, నరేశ్ ముందు ఉండటంతో ఈ ఇద్దరిలో ఒకరిని సేఫ్ జోన్‌లోకి వెళ్లమని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో రాంప్రసాద్ సేఫ్ అయి నామినేషన్‌లో నుంచి సేఫ్ అయ్యాడు. తర్వాత ఝాన్సీ తన పవర్ వాడి నామినేషన్‌ నుంచి సేఫ్ అయింది. తర్వాత దేబ్జానీ, రాంప్రసాద్, త్రిగుణ్, అమన్, వర్షిణి, సుధీర్, వంశీ కెప్టెన్సీ కంటెండర్స్ అవగా... రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్‌, నరేశ్‌ నామినేషన్స్‌లో ఉన్నారు.

అయితే ఎంపికైన ఏడుగురిలో ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ పోటీలో ఉంటారని, అదెవరో మీరే తేల్చుకోండి అని బిగ్‌బాస్ చెప్పడంతో ఏడుగురు తమ పాయింట్స్ చెప్పుకున్నారు. దాంతో అందరూ ఓటింగ్ పెట్టుకుందామని అంటే అమన్ సరే అని అన్నాడు. వర్షిణి, అమన్‌కి డ్రాప్ అయిపోమని చెప్పింది. అమన్ ముందు సరే అన్నాడు గానీ తర్వాత రోహిత్‌తో మాట్లాడిన తర్వాత వద్దని అన్నాడు. అమన్ కోసం రోహిత్, అపూర్వ గొడవ పడినా చివరకు అమన్‌, వర్షిణిని లిస్ట్ నుంచి తీసేశారు. ఇక మిగిలిన దేబ్జానీ, సుధీర్, రాంప్రసాద్, త్రిగుణ్, వంశీ గేమ్ ఆడారు. తొలి రౌండ్‌లో దేబ్జానీ, త్రిగుణ్‌ అవుట్ అయిపోగా తర్వాత టాప్‌లో నిలిచిన సుధీర్ కెప్టెన్ అయిపోయాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. 

(ఇదీ చదవండి: సూపర్‌స్టార్ అని ఎప్పుడూ అనుకోలేదు: రజనీకాంత్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement