ఎంత ఎదిగినా సరే మూలాలు మర్చిపోకూడదు అనే ఓ సామెత ఉంటుంది. కాలక్రమంలో దీన్ని కొందరు పట్టించుకోరు గానీ మరికొందరు మాత్రం తాము ఎక్కడ నుంచి వచ్చామో సందర్భం వచ్చిన ప్రతిసారి గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ అలానే తన కండక్టర్ ఉద్యోగం నాటి రోజుల్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. 'జైలర్ 2' రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు.
నటనతో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్న రజనీకాంత్.. వచ్చే గురువారం (అక్టోబర్ 15) 'జైలర్ 2'తో రాబోతున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రెగ్యులర్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది కాకుండా మూవీలో నటించిన వాళ్లతోనే చాట్ షో లాంటిది ఏర్పాటు చేశారు. ఇది శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇందులో దర్శకుడు నెల్సన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రజనీకాంత్.. బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజులు ఇప్పటికీ ఎంతో గుర్తొస్తాయని చెప్పుకొచ్చారు.
'నటన అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ బస్ కండక్టర్ ఉద్యోగంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో ఐదేళ్లపాటు కండక్టర్‌గా పనిచేసిన రోజులని ఇప్పటికీ మిస్ అవుతున్నాను. నేను పెద్ద సూపర్‌స్టార్‌ని అని ఎప్పుడూ అనుకోలేదు. బెంగళూరు వెళ్లిన ప్రతిసారీ పాత రోజులు గుర్తుకొస్తాయి. బస్సుని చూసినప్పుడల్లా ఎంతో సంతోషం కలుగుతుంది. బస్ కండక్టర్‌గా పనిచేసిన రోజులతో నాకున్న అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిది' అని రజనీకాంత్ అన్నారు.
என்னை பேருந்து நடத்துநராகவே நினைத்துக் கொள்கிறேன் - நடிகர் ரஜினிகாந்த் #Jailer2 | #Rajinikanth | #NelsonDilipkumar https://t.co/EtGUTCNEdK
— நா. சத்தியமூர்த்தி (@RAJINI_1212) October 9, 2026


