ఇండస్ట్రీలో నన్ను తొక్కేస్తున్నారు: స్టార్ హీరోయిన్ | Parvathy Thiruvothu Reacts Her Acting Chances Dropped | Sakshi
Sakshi News home page

Parvathy Thiruvothu: అలా చేస్తున్నందుకు సినిమా ఛాన్సులు రావట్లేదు

Oct 10 2026 6:50 AM | Updated on Oct 10 2026 6:50 AM

Parvathy Thiruvothu Reacts Her Acting Chances Dropped

దాదాపు 20 ఏ‍ళ్లుగా నటిగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరోయిన్ పార్వతి.. ఇండస్ట్రీలో తనని తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చింది. సినీ రంగంలో, సమాజంలో జరిగే సంఘటనలు తనకు అన్యాయం అనిపిస్తే వాటిపై స్పందిస్తూ ఉంటుంది. ఆ మధ్య మళయాళం సినీ అసోసియేషన్‌ నుంచి వైదొలిగిన పార్వతి.. అక్కడ జరుగుతున్న నెపోటిజం, మహిళలపై జరుగుతున్న అక్రమాల గురించి బహిరంగంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది. ఇలాంటి విషయాలే ఈమె కెరీర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా అవకాశాలు గల్లంతవుతున్నాయి. అదే విషయాన్ని నటి పార్వతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

నా అభిప్రాయాలని బహిరంగంగా వ్యక్తం చేస్తుండటంతో నాకు సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి. నన్ను ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు. అయితే ఇలా జరుగుతున్నప్పుడల్లా మలయాళ ప్రేక్షకులు నా నటనని ప్రశంసిస్తూ నన్ను ఆదరిస్తున్నారు. వారు చూపిస్తున్న అభిమానం పవిత్రమైనది. అదే నన్ను ఇంకా సినిమా రంగంలో కొనసాగిస్తోంది అని పార్వతి చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement