బిగ్‌బాస్ 10: ఐదోవారం ఊహించని ఎలిమినేషన్! | Bigg Boss 10 Telugu Apporva Eliminated | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: ఆ ఇ‍ద్దరిలో ఒకరు అనుకుంటే మరొకరు ఎలిమినేట్?

Oct 10 2026 12:32 PM | Updated on Oct 10 2026 12:41 PM

Bigg Boss 10 Telugu Apporva Eliminated

బిగ్‌బాస్ 10వ సీజన్‌లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది. కొత్తగా మరో ఐదుగురు వస్తున్నారంటే హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ పక్కా. ఈసారి అలానే కెప్టెన్ వర్షిణి, ఇమ్యూనిటీ సొంతం చేసుకున్న వంశీ, సుధీర్ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. 'రోడ్ టూ రీలోడ్'లో భాగంగా పలు గేమ్స్ పెట్టి ఇందులో గెలిచిన వాళ్లని సేవ్ చేస్తూ వచ్చారు. అలా చివరకు రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్‌, నరేశ్‌ నిలిచారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా)

‍అయితే వీళ్లలో రోహిత్ ఓటింగ్ పరంగా దూసుకుపోతుండగా.. చరణ్, షాలిని లాంటి వాళ్లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ లేదంటే ఒకరు హౌస్ నుంచి బయటకెళ్లిపోవచ్చనే అంతా అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ట్విస్ట్ అన్నట్లు అపూర్వ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే గనక షాకింగ్ అని చెప్పొచ్చు.

ఎందుకంటే ఈమె వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. అంటే గత నెల 24వ తేదీన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చింది. ఈమెతో పాటే వచ్చిన మిథిలేష్.. రెండే రోజులుండి రూ.15 లక్షలు తీసుకుని ఎలిమినేట్ అయిపోయాడు. ఈమె మాత్రం లోపల ఉండిపోయింది. ఇప్పుడేమో ఓటింగ్ తక్కువ వచ్చిన కారణంగా ఎలిమినేట్ అయిపోయింది! ఈమె ఎగ్జిట్ శనివారం ఉండగా.. మరొకరు ఆదివారం ఎలిమినేట్ కావొచ్చు. మరి రెండో దురదృష్టవంతులు ఎవరనేది చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఆట మార్చేసిన ఝాన్సీ.. డేంజర్ జోన్‌లో ప్రేమపక్షులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement