'నీ ముఖానికి గోల్డ్‌ చైన్‌ ఉందా'.. తట్టుకోలేకపోయా: నటి | Rashika Shetty About Struggles In Early Years Of Acting Career | Sakshi
Sakshi News home page

Rashika Shetty: నీకు బంగారు చైన్‌ వేసుకునేంత సీన్‌ ఉందా? అవమానంతో కుంగిపోయా!

Apr 1 2026 12:42 PM | Updated on Apr 1 2026 12:49 PM

Rashika Shetty About Struggles In Early Years Of Acting Career

రంగుల ప్రపంచంలో రాణించాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ, కొందరే ఎన్నో కష్టాలను అధిగమించి, ముళ్లదారిపై నడిచి చివరకు అవకాశాలు సాధిస్తారు. నువ్వు యాక్టరేంటి? నీకంత సీన్‌ లేదు? అని హేళన చేసేవారికి సీరియల్‌, సినిమా ఛాన్సులతోనే తగిన బుద్ధి చెప్తారు. అలా తాను కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో అవమానాలు పడ్డానంటోంది కన్నడ నటి, బిగ్‌బాస్‌ బ్యూటీ రాశిక శెట్టి.

సూటిపోటి మాటలు
రాశిక మాట్లాడుతూ.. నా జర్నీ ప్రారంభంలో ఆడిషన్స్‌ చాలా కష్టంగా ఉండేవి. ప్రోత్సహించడం పక్కనపెట్టి సూటిపోటి మాటలతో విమర్శలు ఎక్కుపెట్టేవారు. చాలామాటలనేవారు. అవకాశాలిచ్చేవారు కాదు. ఒకసారైతే.. నీ ముఖానికి నిజమైన బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా? అని ముఖం మీదే అన్నారు. చాలా బాధపడ్డాను, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాను.

ఆ నమ్మకంతోనే..
నావల్ల అవుతుందా? అని నాలో నేనే మథనపడ్డాను. అవకాశాలు రాకపోయేవి, వచ్చిన ఒకటీరెండు కూడా చివరి నిమిషంలో చేజారేవి. అప్పుడు మరింత కుంగిపోయాను. అయినా సరే వెనకడుగు వేయాలనుకోలేదు. నాకంటూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశాను. ఆ నమ్మకం, ఆశతోనే ఇండస్ట్రీలో అడుగులు వేశాను అని చెప్పుకొచ్చింది. రాశిక శెట్టి.. కన్నడ బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సందేహం చిత్రంలో యాక్ట్‌ చేసింది.

చదవండి: రామాయణ సినిమా రిజెక్ట్‌ చేశా: రణ్‌బీర్‌ కపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement