రామాయణలో శ్రీరాముడి పాత్ర చేయనన్నా..: రణ్‌బీర్‌ కపూర్‌ | Ranbir Kapoor: Initially I Rejected Ramayana Movie | Sakshi
Sakshi News home page

రామాయణలో రాముడి పాత్ర రిజెక్ట్‌ చేశా.. ​​కానీ నా కూతురు!: రణ్‌బీర్‌ కపూర్‌

Apr 1 2026 10:46 AM | Updated on Apr 1 2026 10:56 AM

Ranbir Kapoor: Initially I Rejected Ramayana Movie

దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ కోసం దాదాపు రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సౌత్‌ సెన్సేషన్‌ హీరోయిన్‌ సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రాఖీభాయ్‌ యష్‌ రావణుడిగా కనిపించనున్నాడు.

రిజెక్ట్‌ చేశా..
అయితే ఈ సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు ఎగిరి గంతేయడానికి బదులుగా రిజెక్ట్‌ చేసేందుకే మొగ్గు చూపానంటున్నాడు రణ్‌బీర్‌ కపూర్‌. న్యూయార్క్‌లో రామాయణ దర్శకుడు నితీశ్‌ తివారి, నిర్మాత నమిత్‌ మల్హోత్రాతో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు రణ్‌బీర్‌. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే నితేశ్‌ తివారి నాకు రామాయణ సినిమా గురించి చెప్పాడు. ప్రధాన పాత్రలో నటించమని కోరగా నేను క్షణం ఆలోచించకుండా నో చెప్పాను.

కీలకమైన మలుపు
నేను ఆ పాత్రకు సెట్‌ అవనేమో, బాగోనేమో అని నాపై నాకే అనుమానం వేసింది. రాముడి పాత్రకు నేను పూర్తి న్యాయం చేయలేనని తిరస్కరించాను. కానీ, ఆ భయం చాలా త్వరగానే కనుమరుగవగా అంత మంచి ఛాన్స్‌ వచ్చినందుకు సంతోషించాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు నా జీవితానికి చాలా అవసరమయ్యాయి. ఆ సమయంలో నేను తండ్రినయ్యాను. నా పద్ధతుల్ని, జీవితాన్ని మార్చుకోవాల్సిన దశలో ఉన్నాను. శ్రీరాముడి పాత్ర పోషించడం, తొలిసారి తండ్రి కావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ నా జీవితాన్ని కీలక మలుపు తిప్పిన అందమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు.

సినిమా
కాగా రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహా జన్మించింది. రామాయణ విషయానికి వస్తే.. ఏర్‌ రెహ్మాన్‌, హన్స్‌ జిమ్మర్‌ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్‌లో దీపావళికి విడుదలవుతుండగా రెండో భాగం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 2న రామాయణ సినిమా గ్లింప్స్‌ విడుదల కానుంది.

చదవండి: గుడిలో గిన్నెలు కడిగిన ప్రియాంక చోప్రా

Advertisement
 
Advertisement
Advertisement