గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌కు వెళ్లిపోయినా తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. అందుకు నెట్టింట వైరల్‌గా మారిన వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. మంగళవారం నాడు ఆమె అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.
వీడియో వైరల్
గుడిలో వాడిన పాత్రలను కొందరు మహిళలు శుభ్రం చేస్తుంటే తను కూడా వారికి సాయం చేసింది. తలపై దుపట్టా కప్పుకుని గిన్నెలు కడిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ప్రియాంక అమెరికాలో సెటిలైనప్పటికీ తనలో భారతీయత ఉట్టిపడుతోందని కామెంట్లు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయినప్పటికినీ.. ఇలా సేవ చేయడాన్ని తను ఏమాత్రం చిన్నతనంగా భావించడం లేదు, నిజంగా గ్రేట్ అని పొగుడుతున్నారు.
సినిమా
ఇకపోతే ప్రియాంక చోప్రా చివరగా 'ద బ్లఫ్' అనే హాలీవుడ్ మూవీ చేసింది. ప్రస్తుతం తెలుగు చిత్రం 'వారణాసి'లో యాక్ట్ చేస్తోంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.


