బిగ్‌బాస్ రియాలిటీ షో అప్పుడే ఐదోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఈ వారంలో హౌస్‌లో జరిగిన సంఘటనలు, వివాదాలపై క్లాస్ పీకడం జరుగుతుంది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ వీకెండ్‌లో ఏం జరిగిందో హైలెట్స్‌లో చూసేద్దాం.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రియాలిటీ షో రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. అయితే ఈ వీకెండ్‌లో జరిగిన పరిణామాలు ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ను నిలబెట్టి క్లాస్ పీకారు.
ఐదో వారం ఎలిమినేషన్స్‌లో కెప్టెన్ వర్షిణి, వంశీ, సుధీర్ మినహా మిగిలిన కంటెస్టెంట్లంతా ఉన్నారు. రోడ్ టూ రీలోడ్ టాస్క్‌లో కొందరు సేవ్ కాగా.. చివరకు రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ మిగిలారు. ఓటింగ్ పరంగా రోహిత్ దూసుకెళ్తుండగా.. చరణ్, షాలినిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.
అయితే మూడు వారాల క్రితం మరో కంటెస్టెంట్ మిథిలేశ్‌తో కలిసి అపూర్వ హౌస్‌లోకి అడుగుపెట్టింది. మిథిలేష్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ తీసుకుని జాక్‌పాట్ కొట్టేశాడు. అపూర్వ రాగానే కెప్టెన్ అయినప్పటికీ దూకుడు, విపరీతమైన అరుపులతో హౌస్‌మేట్స్‌తో విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఓటింగ్‌లో ఆమెకు ఆడియన్స్ నుంచి అనుకున్న స్థాయిలో ఓట్లు పడకపోవడంతోనే ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ వారంలో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరిలో శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ ఉన్నారని టాక్ వినిపిస్తోంది.


