ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | The Kerala Story 2 OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

The Kerala Story 2 OTT: ఓటీటీకి ది కేరళ స్టోరీ-2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 24 2026 2:28 PM | Updated on Apr 24 2026 2:38 PM

The Kerala Story 2 OTT Streaming Date Locked

ఆదా శర్మ కీలక పాత్రలో వచ్చిన మూవీ ది కేరళ స్టోరీ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. రచయిత విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం మే 8వ తేదీ నుంచి ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.  ఈ సినిమాను కేరళలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement