పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్‌ తండ్రి | SA Chandrasekhar Gifts Car to His Wife on Wedding Anniversary | Sakshi
Sakshi News home page

SA Chandrasekhar: 79 ఏళ్ల వయసులో భార్యకు గిఫ్ట్‌ ఇచ్చిన ప్రముఖ డైరెక్టర్‌

Apr 24 2025 5:41 PM | Updated on Apr 24 2025 5:49 PM

SA Chandrasekhar Gifts Car to His Wife on Wedding Anniversary

పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ (S A Chandrasekhar).

ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లే
ఈ కోలీవుడ్‌ డైరెక్టర్‌.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్‌నాథన్‌, సి.రంగనాథన్‌, పవిత్రన్‌, ఎస్‌.శంకర్‌, ఎం. రాజేశ్‌ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్‌గా పనిచేశారు.

BMW కారు గిఫ్ట్‌
చంద్రశేఖర్‌.. తన కుమారుడు విజయ్‌ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్‌ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్‌ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్‌ యానివర్సరీ గిఫ్ట్‌గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్‌.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్‌ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

చదవండి: పాకిస్తాన్‌ సైన్యంలో ఫౌజీ హీరోయిన్‌ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement