పాకిస్తాన్‌ సైన్యంలో ఫౌజీ హీరోయిన్‌ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి | Imanvi Reacts To False Allegations On Her Identity Released Poster, Says She is Not Pakistani, Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Imanvi: ఫౌజీ హీరోయిన్‌ది పాకిస్తాన్‌? కుండబద్ధలు కొట్టిన ఇమాన్వి

Apr 24 2025 12:52 PM | Updated on Apr 24 2025 1:22 PM

Imanvi Reacts on Her Identity, Says She is Not a Pakistani

ప్రభాస్‌ ఫౌజీ సినిమా హీరోయిన్‌ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్‌పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్‌ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్‌ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్‌ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్‌ చేశారు.

తీవ్రంగా ఖండిస్తున్నా..
ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.

దుష్ప్రచారం
దీన్ని క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్‌ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.

నా రక్తంలోనూ..
USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

 

 

చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్‌.. మండిపడ్డ నెటిజన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement