అల్లు అర్జున్ పెళ్లి రోజు... భార్య గురించి క్యూట్ పోస్ట్ | Allu Arjun Wishes Sneha Reddy On Their 13th Wedding Anniversary | Sakshi
Sakshi News home page

Allu Arjun: భార్యని తెగ పొగిడేసిన బన్నీ.. పోస్ట్ వైరల్

Mar 6 2024 10:31 AM | Updated on Mar 6 2024 11:50 AM

Allu Arjun Wishes Sneha Reddy On 13th Wedding Anniversary - Sakshi

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయిన అల్లు అర్జున్.. ఇప్పుడు దీని సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి షూటింగ్ యమ ఫాస్ట్‌గా సాగుతోంది. ఓవైపు మూవీ చేస్తూనే మరోవైపు కుటుంబంతోనూ బన్నీ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

(ఇదీ చదవండి: మళ్లీ థియేటర్లలోకి ఉదయ్ కిరణ్.. కల్ట్ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే?)

నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్.. హీరోగా క్రమక్రమంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు మలయాళంలోనూ ఫేమ్ సంపాదించాడు. 'పుష్ప' మూవీతో మాత్రం పాన్ ఇండియా రేంజులో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇకపోతే 2011లో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు అయాన్, అర్హ పుట్టారు. ఇకపోతే తన 13వ పెళ్లి రోజు సందర్భంగా భార్యని బన్నీ తెగ పొగిడేశాడు.

'మన పెళ్లయి 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ' అని అల్లు అర్జున్, భార్యతో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి క్యూట్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

(ఇదీ చదవండి: కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement