‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్‌’ | Sakshi
Sakshi News home page

‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్‌’

Published Mon, Feb 10 2020 10:08 AM

Namrata Shirodkar Wedding Anniversary Wishes To Soulmate Mahesh Babu - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. నేడు వారి పెళ్లిరోజు. అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు అందిస్తూ మహేశ్‌కు తోడుగా నిలిచే నమ్రత భాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అమ్మాయి కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకందించావ్‌. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావ్‌. మీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే.

మీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. ఇంతకన్నా ఏం కావాలి నాకు. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని  నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇక కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలో సూపర్‌స్టార్‌ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తాడు. అంతేకాదు అందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులను ఆకట్టుకుంటాడు. 

చదవండి : 
శస్త్ర చికిత్స చేయించుకోనున్న మహేశ్‌బాబు!
ఆమె జీవిత మంత్రం అదే

Advertisement
 
Advertisement