
యాంకర్ లాస్య- మంజునాథ్ దంపతులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఇటీవలే మహా కుంభమేళాకు వెళ్లిన వీరు తర్వాత అరుణాచలం వెళ్లారు.

అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను లాస్య సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. తాజాగా తన ఎనిమిదో పెళ్లి రోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది.

ఇది మన ఎనిమిదో పెళ్లి రోజు. చూస్తుండగానే ఎనిమిదేళ్లు అయిపోయాయా?

మన ప్రేమ ప్రయాణాన్ని కూడా కలుపుకుంటే పదిహేనేళ్లు. ఈ మధురమైన జర్నీని ఇలాగే కొనసాగిద్దామా బుజ్జి..? హ్యాపీ యానివర్సరీ మై హ్యాండ్‌సమ్ హజ్బెండ్.

నీతో ఉన్న ప్రతిరోజు అందమైనదే! నీతో పోట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం.

కానీ ఇకపై దాన్ని ఆపేద్దాం. ప్రేమను మాత్రమే పంచుకుందాం. మరిది సాధ్యమవుతుందంటావా? అని రాసుకొచ్చింది.

ఇది చూసిన అభిమానులు లాస్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.








