
రవితేజ పవర్ చిత్రంలో విలన్‌గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటుడు హరీశ్ ఉత్తమన్

వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన హరీశ్ మొదట ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మేకప్ ఆర్టిస్ట్ అయిన తన ప్రియురాలు అమ్రిత కళ్యాణ్ పూర్‌ను పెళ్లాడారు.

ఆ తర్వాత ఏడాదికే వీరిద్దరు విడిపోయారు.

అయితే నటి చిన్న కురువిలను రెండో పెళ్లి చేసుకున్నారు హరీశ్.

2022లో చిన్ను కురువిలను రెండో పెళ్లి చేసుకున్నారు.

తాజాగా ఈ జంట తమ వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా హరీశ్ ఇన్‌స్టాలో స్పెషల్ వీడియోను షేర్ చేశారు.

రవితేజ పవర్ చిత్రంలో విలన్‌గా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు హరీశ్.

ఆ తర్వాత జిల్, శ్రీమంతుడు, కృష్ణ గాడి వీర ప్రేమగాథ, ఎక్స్‌ప్రెస్ రాజా, దువ్వాడ జగన్నాథమ్, జై లవ కుశ, నా పేరు సూర్య లాంటి చిత్రాల్లో విలన్‌గా ఆకట్టుకున్నాడు.

2010లో థా చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హరీశ్

తమిళంలో విశాల్ నటించిన సూపర్ హిట్ మూవీ 'పాండియనాడు'లో ప్రతినాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు.

ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 30 పైగా చిత్రాల్లో నటించారు.

సినిమాల్లోకి రాకముందు ఎయిర్‌లైన్స్‌లో కేబిన్ క్రూలో సుమారు ఆరేళ్లపాటు విధులు నిర్వహించారు.


























