
తేజస్విణి మృతదేహం
గుత్తి: పెళ్లి రోజు సంబరాలు చేయడానికి భర్త ఒప్పుకోలేదని క్షణికావేశానికి లోనైన భార్య బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తి ఆర్‌ఎస్‌లోని బండిమోటు వీధికి చెందిన జరాల్డ్, తేజస్విణి (24) ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. జరాల్డ్ బళ్లారిలోని జిందాల్ ఫ్యాక్టరీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం వీరి పెళ్లిరోజు కావడంతో వేడుక చేసుకుందామని జిందాల్ నుంచి గుత్తి ఆర్‌ఎస్‌కు వచ్చాడు. అయితే పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటే అరిష్టం జరుగుతుందని ఓ పూజారి చెప్పాడని జరాల్డ్ భార్యకు చెప్పాడు. వేడుక వద్దని తెలపడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పెద్దలు సర్దిచెప్పి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. బుధవారం ఉదయం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తానం చెందిన తేజస్వణిని ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ గోపాలుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం భర్త జరాల్డ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.